ETV Bharat / state

Jupalli KrishnaRao Arrest : ధాన్యం కొనుగోలులో అక్రమాలపై జూపల్లి ధర్నా.. అరెస్టు చేసిన పోలీసులు - జూపల్లి అరెస్ట్ తాజా వార్తలు

Jupalli KrishnaRao Arrest : వరి కొనుగోలులో అక్రమాలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ జూపల్లి కృష్ణారావు నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఇది కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు జూపల్లిని అరెస్ట్ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Jupalli KrishnaRao
Jupalli KrishnaRao
author img

By

Published : May 29, 2023, 5:30 PM IST

Updated : May 29, 2023, 5:45 PM IST

Jupalli KrishnaRao on Paddy : నాగర్​కర్నూల్ జిల్లాలో ధాన్యం కొనుగోలులో అవకతవకలపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేపట్టిన ఆందోళన.. ఉద్రిక్తంగా మారింది. రైతులకు న్యాయం చేయాలంటూ వారితో కలిసి కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అయినా కలెక్టర్ అక్కడికి రాలేదు. దీంతో అక్కడి నుంచి ఆయన కార్యకర్తల వెంట ర్యాలీగా తరలి వెళ్లి.. కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.

Jupalli Dharna in Nagarkurnool : కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కూడా జూపల్లి కృష్ణారావుకు ఎలాంటి హామీ రాకపోవడంతో.. అక్కడే ఉన్న మార్కెట్ యార్డ్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. రైతులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూపల్లి అనుచరులు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆయనకు నచ్చచేప్పేందుకు ప్రయత్నించారు.

పోలీసులకు జూపల్లి అనుచరుల మధ్య వాగ్వాదం: ఈ క్రమంలోనే జూపల్లి కృష్ణారావు తనకు కలెక్టర్ నుంచి లిఖితపూర్వకంగా హామీ వస్తే.. ఆందోళన విరమిస్తానని తేల్చి చెప్పారు. మరోవైపు రోడ్డుపై వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు కలగజేసుకొని జూపల్లిని అదుపులోకి తీసుకొని. పోలీస్​స్టేషన్​కు తరలిస్తుండగా ఆయన అనుచరులు అడ్డు తగిలారు. ఇందులో భాగంగానే వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Jupalli KrishnaRao Arrest : నిరనకారులను చెదరగొట్టిన పోలీసులు జూపల్లిని అరెస్టు చేసి తెలకపల్లి పోలీస్​స్టేషన్​కు తరలించారు. మరోవైపు ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ అనుచరులు మరోమారు బస్టాండ్ ముందు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.

ధాన్యం కొనుగోలులో అక్రమాలపై జూపల్లి ధర్నా

"ధాన్యంలో తరుగు తీయకుండా రైతులకు డబ్బులకు చెల్లించాలి. తూకం ప్రకారమే వారికి నగదు చెల్లించాలి. అన్నదాతల సమస్యపై మేము పోరాడుతుంటే ఇంతవరకూ కలెక్టర్ ఇక్కడికి రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రైతులు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు." - జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి

Farmers Protest : మరోవైపు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా నరసాపూర్ చౌరస్తాలో తూకం వేసిన తర్వాత కూడా సకాలంలో లారీలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంమలో వాహనదారులు, అన్నదాతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వాహనదారులతో క్షమాపణలు చెప్పించడంతో గొడవ సద్దుమణిగింది. నిర్మల్‌ జిల్లా చించోలి బీ గ్రామంలో కర్షకులు చేపట్టిన ఆందోళనకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. సకాలంలో అవసరమైన లారీలు సమకూర్చి ఇబ్బందుల్లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి : Farmers Protest in Telangana : 'కొనుగోళ్ల తీరుపై అన్నదాత ఆగ్రహం.. రోడ్డెక్కి నిరసనలు'

Last Updated : May 29, 2023, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.