ETV Bharat / state

అడవి బిడ్డల కంటే యురేనియం గొప్పదా..? - వామపక్ష నేతలు

నల్లమల అటవీ ప్రాంతాన్ని వల్లకాడుగా మార్చడానికి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని వామపక్ష నేతలు ఆరోపించారు. యురేనియం తవ్వకాలు చేపడితే అడవి బిడ్డల ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

యురేనియం గొప్పదా..?
author img

By

Published : Aug 9, 2019, 7:54 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా అమ్రాబాద్ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరిపితే అడవి బిడ్డల ఉనికికే పెను ప్రమాదం ఏర్పడుతుందని వామపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీయం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నాయకురాలు పద్మ, సీపీఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి గుర్రం విజయ్ కుమార్, లోక్​సత్తా రాష్ట్ర కార్యదర్శి మన్నారం నాగరాజుతో పాటు ఇతర నాయకులు నల్లమల ప్రాంతంలోని పర్యటించారు.

యురేనియం తవ్వకాల పేరుతో నల్లమల ప్రాంతాన్ని వల్లకాడుగా చేయడానికి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని వారు ఆరోపించారు. అడవి బిడ్డల జీవనం కంటే యూరేనియం గొప్పది కాదన్నారు. ప్రజల వినాశనానికి పెను ప్రమాదంగా మారుతున్న యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమల ప్రజలు మరో స్వాతంత్ర పోరాటం చేయాలని వారు నినదించారు. ఈ పోరాటాలకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తుందని వారు హామీ ఇచ్చారు.

యురేనియం గొప్పదా..?

ఇవీ చూడండి: ఇకపై వ్యవసాయానికి మాత్రమే వ్యవసాయ రుణాలు

TG_MBNR_12_9_NALLAMALA_CPM_URENIYAM_AVB_TS10050 CENTRE:-NAGARKURNOOL CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN CELLNO:-9885989452 ( )నల్లమల్లలో యూరేనియం తవ్వకాలు జరిగితే ఆడవి బిడ్డల మానవాళి మనుగడకే పెను ప్రమాధంగా తయారైతుందని వామపక్ష నేతలు ఆందోళన వ్వక్తం చేశారు. వాయిస్ ఓవర్:- నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమల ప్రాంతంలోని చెంచు పెంటలను సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం,సిపిఐ నాయకురాలు పశ్య పద్మ,సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి గుర్రం విజయ్ కుమార్,లోక్ సత్తా రాష్ట్ర కార్యదర్శి మన్నారం నాగరాజు తో పాటు.. వివిధ వామపక్షాల నాయకులు నల్లమల ప్రాంతంలోని అప్పాపూర్,సార్లపల్లి,వటువర్లపల్లి గ్రామాల్లో పర్యటించారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్నోతరాలుగా నల్లమల ఆడవిని నమ్ముకోని జీవనం సాగిస్తున్న ఆడవి బిడ్డలను యూరేనియం తవ్వకాల పేరుతో నల్లమల ప్రాంతాన్ని వల్లకాడుగా చేయడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నారని వారు ఆరోపించారు.ఆడవి బిడ్డల జీవనం కంటే యూరేనియం గోప్పది కాదన్నారు.ప్రభుత్వాలకు విద్యుత్ ఆవసరాలకు యూరేనియం అంత ఆవసరమా అని వారు ప్రశ్నించారు? విద్యుత్ ఆవసరాలకు సోలార్,జల విద్యుత్ ,పవన విధ్యుత్ ఉందన్నారు.నల్లమల్లలో యూరేనియం తవ్వకాలు జరిగితే ఈ ప్రాంతంలో వచ్చే తరాలకు మానవుడి జాడ లేకుండా పోతుందన్నారు.ప్రజల వినాశనికి పెను ప్రమాధంగా మారుతున్న యూరేనియం తవ్వకాలను వ్వతిరేకంగా నల్లమల ప్రజలు మరో స్వాతంత్ర పోరాటం చేయాలని వారు పిలుపు నిచ్చారు.ప్రజలు చేసే పోరాటాలకు వామ పక్ష పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ఇస్తుందని వారు హమి ఇచ్చారు.యూరేనియం తవ్వకాల కోసం వచ్చే వారిని ప్రతిఘడించాలని వారు పిలుపునిచ్చారు....AVB Bytes:- వామపక్ష నేతలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.