నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రంలో ఆక్రమణలపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం స్పందించింది. కేసరి సముద్రం మినీ ట్యాంక్‌బండ్ ఆక్రమణలపై గత నెల డిసెంబర్ 20న "భూ దాహం చెరువులు మాయం" అని 'ఈటీవీ భారత్' ప్రసారం చేసిన కథనంపై అధికారులు స్పందించారు.
కేసరి సముద్రం బఫర్ జోన్ పరిధిలోకి వస్తున్న సుమారు ఏడు ఎకరాల భూములకు గత ఆర్డీవో ఇచ్చిన వ్యవసాయేతర భూముల అనుమతులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ రద్దు చేశారు. నాలా అనుమతులను రద్దు చేస్తూ... భూ యజమానులకు నోటీసులు జారీ చేశారు.
ఇవీ చూడండి: 'ఇప్పుడు వ్యతిరేకించకుంటే.. రేపు మరొకరికి ఇదే దుస్థితి రావొచ్చు'