శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. ఇన్‌ఫ్లో 9.40 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 8.65 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 878.90 అడుగులకు చేరింది. 10 గేట్ల ద్వారా 7.67 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,145 క్యూసెక్కులు... కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,600 క్యూసెక్కుల నీరు విడుదల కాగా హంద్రీనీవాకు 1,013 క్యూసెక్కుల నీరు విడుదల అయింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 28 వేల క్యూసెక్కులు, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 735 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.
ఇవీ చూడండి : భారీ వర్షాలతో గోదావరికి జల కళ