ETV Bharat / state

సాగునీటి ప్రాజెక్టుల సర్వే పనులకు గువ్వల శంకుస్థాపన

author img

By

Published : Mar 29, 2021, 10:04 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఎత్తిపోతల పథకం సర్వే పనులను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీసమేతంగా ఉమామహేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Guvvala balaraju
సర్వే పనులకు గువ్వల శంకుస్థాపన

బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్చంపేట నియోజకవర్గానికి సాగు నీటి ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఈ మేరకు వాటి సర్వేను ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఉమామహేశ్వరం దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించారు. గువ్వల దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం చంద్రసాగర్​లో ఎత్తిపోతల పథకం సర్వే పనులకు గువ్వల బాలరాజు దంపతులు శంకుస్థాపన చేశారు. ఏదుల రిజర్వాయర్ నుంచి బల్మూర్​లోని ఉమామహేశ్వర ప్రాజెక్టుకు 1,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తామని బాలరాజు తెలిపారు. ఇక్కడి నుంచి మన్ననూర్​లోని చెన్నకేశవ ప్రాజెక్టు రిజర్వాయర్​కు నీటిని అందించి.. 25 వేల ఎకరాలకు, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల మండలాల్లోని 45 వేల ఎకరాలకు మొత్తం 70 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

ఇదీ చూడండి: నాగార్జునసాగర్ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.