నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారగొండ, వంగూర్ మండలాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు పర్యటించారు. చారగొండలో నిర్మించనున్న విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వంగూర్ మండలంలోని కొండారెడ్డిపల్లిలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తిస్తున్నారని, గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మావతి, వైస్ ఛైర్‌పర్సన్ బాలాజీ సింగ్, పలువురు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.