ETV Bharat / state

పెట్రోల్​ బాటిళ్లతో 11 మంది రైతుల ఆందోళన - నాగర్​కర్నూల్​ తాజా వార్త

నాగర్​ కర్నూల్​ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని గ్రామస్థులు తమ భూ సమస్య పరిష్కరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్​ బాటిళ్లతో కలెక్టర్​ కార్యాలయంపైకి ఎక్కి ఆందోళనకు దిగారు.

farmers protest with petrol bottles in nagarkarnool
పెట్రోల్​ బాటిళ్లతో 11మంది రైతుల ఆందోళన
author img

By

Published : Feb 17, 2020, 7:29 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రొల్ గ్రామానికి చెందిన 11 మంది రైతులు కలెక్టర్​ కార్యాలయంపైకి ఎక్కి ఆందోళనకు దిగారు. పశువులకు మేత కోసం సమీపంలోని గోపులపురం గ్రామంలోని మశన్న అనే రైతు నుంచి ఈ 11 మంది రైతులు రెండున్నర ఏకురాల భూమి 1994 లో కొన్నారు. కానీ ఈ మధ్య కాలంలో భూమి అమ్మిన మశన్న చనిపోయాడు.

ఆ తర్వాత అతని అల్లుడు తమ భూమిని ఆక్రమించి, దౌర్జన్యం చేస్తున్నాడంటూ రెవిన్యూ అధికారుల వద్ద ఈ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ దీనిపై ఎవరూ స్పందించకపోవడం వల్ల విసుగుపోయిన రైతులు పెట్రోల్​బాటిళ్లు పట్టుకుని కలెక్టర్​ కార్యలయంపైకి ఎక్కి నిరసన వ్యక్తంచేశారు.

తమ సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శ్రీధర్ వారి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించారు.

పెట్రోల్​ బాటిళ్లతో 11మంది రైతుల ఆందోళన

ఇవీ చూడండి: కాకతీయ కాలువలో ఎమ్మెల్యే చెల్లి, బావ, మేనకోడలి మృతదేహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.