ETV Bharat / state

డ్రోన్​ కెమెరాల సాయంతో పటిష్ఠ నిఘా - డ్రోన్ కెమెరాలు

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలో డ్రోన్ కెమెరా సాయంతో వివిధ కాలనీల్లో నిఘా ఏర్పాట్లను డీఎస్పి గిరిబాబు, పురపాలిక ఛైర్మన్ ఎడ్మ సత్యం పర్యవేక్షించారు. లాక్​డౌన్​ను ఉల్లంఘింస్తూ ప్రజలు ఎవరైనా బయట తిరుగుతుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

DSP Giribabu, who supervised surveillance with the help of drone cameras in nagarkarnool
డ్రోన్​ కెమెరాల సాయంతో పటిష్ఠ నిఘా
author img

By

Published : Apr 9, 2020, 8:44 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలో డ్రోన్ కెమెరా సాయంతో వివిధ కాలనీల్లోని ప్రజల కదలికలను పర్యవేక్షిస్తున్నట్లు డీఎస్పీ గిరిబాబు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లో నుంచి బయటకు రావడం, కాలనీ వాసులతో ముచ్చట్లు పెట్టడం, ఇతరత్రా కార్యక్రమాలు చేయొద్దని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు లాక్​డౌన్​ను కచ్చితంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే వ్యక్తిగత దూరం తప్పనిసరిగా పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. లాక్​డౌన్ విధించిన కారణంగా ప్రజలు నిత్యావసర సరుకులకు ఇంట్లో ఒక్కరు మినహాయిస్తే ఇతరలు ఎవరు ఇంటి నుంచి బయటికి రావొద్దని నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

ఇవీ చూడండి: కరోనా ఉన్మాదం: దుకాణంలో సరకులను నాలుకతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.