నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నల్లమల అటవీ ప్రాంతాల్లోని చెన్నారం, సార్లపల్లి, కుడిచింతల బయలు, మల్లాపూర్ చెంచుపేటలోని పేదలకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు చేయూత అందిస్తున్నాయి. అచ్చంపేట డీఎస్పీ నరసింహులు చేతులమీదుగా ఆయా గ్రామల్లోని ఐదు వందల కుటుంబాలకు బియ్యం, 15 రకాల నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నల్లమల్ల ప్రాంతంలో యంగిస్థాన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో చెంచులు, పేదలకు సాయం చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట సీఐ రామకృష్ణ, యంగిస్థాన్ ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్ భేష్'