నాగర్కర్నూల్ జిల్లా ఎన్మనబెట్టు సమీపంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు కోడూరు మండలం నర్సాయిపల్లికి చెందిన కురువ కురుమయ్యగా పోలీసులు నిర్ధరించారు. ఆదివారం కూలి పనులకు వెళ్లిన కురుమయ్య కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఎంతవెతికినా ఆచూకి దొరకలేదు. చివరికి ఎన్మనబెట్టు సమీపంలో విగతజీవిగా కనిపించాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీచూడండి: నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగు ధాటికి తాడిచెట్టు దగ్ధం