నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో రాజేశ్ కుమార్‌కు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సామాన్యులను, ఉద్యోగస్తులను ఇబ్బందులకు గురి చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యతరగతి ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. వారి ఆర్థిక ప్రగతికి గొడ్డలి పెట్టు లాంటిదని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే క్రమబద్ధీకరించి పేద ప్రజలకు వెసులుబాటు కల్పించాలని వినతిపత్రంలో వారు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ