కాంగ్రెస్ సర్పంచ్లను అధికారులు వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అచ్చంపేట నియోజకవర్గంలోని అధికారులు.. స్థానిక శాసనసభ్యులు గువ్వల బాలరాజుకు వంత పాడుతున్నారన్నారు. అధికార పార్టీ సర్పంచ్లను ఏమీ అనకుండా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ శారదను వేధింపులకు గురిచేస్తూ ఆమెను సస్పెండ్ చేశారని తెలిపారు.
శారదను తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 5న కలెక్టరేట్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే.. ప్రజలకు కాదు: మాణిక్కం