నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో అమ్రాబాద్ సర్పంచ్ శారదపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆయనకు మద్దతుగా మాజీ ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చారు. జిల్లాకేంద్రంలోని గాంధీ ధర్నాచౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కలెక్టరేట్ ఆవరణలో రెండు గంటల పాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు ధర్నా చేపడతామని దీక్ష విరమించే ప్రసక్తే లేదని అన్నారు. చివరికి అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి హామీ ఇస్తూ సస్పెన్షన్ వేటు ఎత్తివేసినట్లు ఆర్డర్పత్రం ఇవ్వగా దీక్ష విరమించారు.
ఇదీ చూడండి: 'రెండు పడకల గదుల ఇళ్లను అమ్ముకునే వారిపై కేసులు'