ETV Bharat / state

క్వారంటైన్​ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్​ శ్రీధర్​ - latest news on collector Sridher examined the Quarantine Center

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సహకరించాలని జిల్లా కలెక్టర్​ శ్రీధర్​ పేర్కొన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాన్ని ఆయన పర్యవేక్షించారు.

collector Sridher examined the Quarantine Center
క్వారంటైన్​ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్​ శ్రీధర్​
author img

By

Published : Apr 7, 2020, 9:00 PM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలు ఇంటిని వదిలి బయటకు రావొద్దని.. వ్యక్తికి వ్యక్తికి మధ్య భౌతిక దూరం పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలోని మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలను క్వారంటైన్‌ కేంద్రంగా సిద్ధం చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్‌ మను చౌదరితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

క్వారంటైన్​లో ఉన్న వారిని 24 గంటల పాటు పర్యవేక్షించేందుకు ఒక వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని కలెక్టర్​ సూచించారు. ఈ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించకుండా బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా క్వారంటైన్‌ కేంద్రం వద్ద సేవలందించే అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం పట్టణంలోని ఓ వ్యక్తికి కరోనా వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో ప్రజలెవరినీ బయటికి రానివ్వొద్దని అధికారులకు సూచించారు.

ఇదీ చూడండి : 'ఎంపీ ల్యాడ్స్​ నిధుల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.