ETV Bharat / state

'నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాలు త్వరగా పూర్తిచేయండి'

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ సముదాయాల నిర్మాణ పనులను కలెక్టర్ శర్మాన్ పరిశీలించారు. సంయుక్త కలెక్టర్ హనుమంత్ రెడ్డి, అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పోస్టర్ విడుదల
పోస్టర్ విడుదల
author img

By

Published : Sep 8, 2020, 9:24 PM IST

నూతన కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణ పనులను వేగంగా నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ సముదాయాల నిర్మాణ పనులను సంయుక్త కలెక్టర్ హనుమంత్ రెడ్డి, అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్, అదనపు కలెక్టర్ ల నివాసాల నిర్మాణాలను పరిశీలించారు. కలెక్టరేట్ వెనుక భాగంలో మొక్కలు నాటాలని సూచించారు. పార్కింగ్, సమావేశ మందిరం తదితర నిర్మాణాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను కలెక్టర్ శర్మన్ సన్మానించారు.

సన్మానం
సన్మానం

ఈనెల 1 నుంచి 31కు వరకు పోషణ్ అభియాన్ మాసం ఉండడం వల్ల ఈ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోషణ అభియాన్ మాస పోస్టర్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈనెల రోజుల పాటు అంగన్వాడీ కేంద్రాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టి చిన్నపిల్లలు, గర్భిణీలు బాలింతలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.