పల్లె ప్రగతి పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఎల్ శర్మాన్ చౌహన్ హెచ్చరించారు. జిల్లాలోని వంగూరు, తాడూరు మండల కేంద్రాలు... మాచిన్నోనిపల్లి, పోల్కంపల్లి గ్రామాలను ఆకస్మికంగా సందర్శించి.. పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.
గ్రామపంచాయతీ డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువుల తయారీ, షెడ్లు, శ్మశానవాటికలు, రైతు వేదిక నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాల పనులను పరిశీలించి త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులు, గ్రామ సర్పంచ్ లను ఆదేశించారు. హరితహారం, గ్రామ స్వచ్ఛత పనులలో పారిశుద్ధ్య కార్మికులు ఉదయాన్నే పాల్గొని గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచాలని చెప్పారు.