ETV Bharat / state

'వీలైనంత త్వరగా పంప్​హౌస్​ను పునరుద్ధరించాలి' - Cm osd Smith sabarval visit kli pump house news

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎల్లూరు లిఫ్ట్​లో ప్రమాదవశాత్తు ముంపునకు గురైన పంప్​హౌజ్​ను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. నీట మునిగిన పంప్ హౌజ్, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు, మిషన్ భగీరథ, ఎల్లూరు ప్రధాన పంప్ హౌజ్​లను సందర్శించిన ఆమె... ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగానికి, నీటి పారుదల, కేఎల్​ఐ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

'వీలైనంత త్వరగా పంప్​హౌస్​ను పునరుద్ధరించాలి'

author img

By

Published : Oct 22, 2020, 12:04 AM IST

మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్ ఎల్లూరులో నీట మునిగిన పంప్​హౌజ్​ను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

'వీలైనంత త్వరగా పంప్​హౌస్​ను పునరుద్ధరించాలి'
'వీలైనంత త్వరగా పంప్​హౌస్​ను పునరుద్ధరించాలి'

పంప్​హౌస్ సందర్శన..

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో నీటమునిగిన కేఎల్​ఐ పంప్​హౌస్​ను సందర్శించారు. నీటి పారుదల శాఖ అధికారులు, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులు, ఏజెన్సీలతో ఆమె మాట్లాడారు. ఘటన జరగడానికి గల కారణాలను విశ్లేషించారు. ప్రమాదం జరిగిన సమయంలో గుర్తించిన వారు, పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంపులు నీటమునిగి పోవడానికి గల కారణాలు, సమాచార వ్యవస్థ, పంపులు ఏర్పాటు చేసిన సంవత్సరం, వాటి సామర్థ్యం, సర్వీస్, నిర్వహణ తదితర విషయాలపై ఆరాతీశారు.

పంప్​హౌస్
పంప్​హౌస్

రిజర్వాయర్ల పనులపై ఆరా..

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్ పనులను సైతం స్మిత సబర్వాల్ పరిశీలించారు. తాగునీటి కోసం ఎల్లూరు రిజర్వాయర్​కు ప్రత్యామ్నాయంగా అంజనగిరి రిజర్వాయర్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన ఇన్ టెక్​వెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పాలమూరు- రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా భవిష్యత్తులో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని వ్యవసాయ భూములకు, చాలా పట్టణాలు గ్రామాలకు తాగునీరు అందిస్తున్నందున ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని, సున్న టీఎంసీ వద్ద కూడా తాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.

అధికారులతో సమీక్ష..

పంపుహౌజ్ మునక వల్ల ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని వనపర్తి, మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్లు యాస్మిన్ బాష, వెంకట్రావులకు సూచించారు. మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి జిల్లా కలెక్టర్లు, నీటి పారుదల శాఖ ఇంజినీర్లు, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అధికారులతో సమీక్ష
అధికారులతో సమీక్ష

సరఫరాకు చర్యలు చేపట్టాం...

తాగునీటి పంపిణీలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా తాగునీరు నాణ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులపై ఉందన్నారు. తాగునీరు సురక్షితంగా ఉండేందుకు క్లోరిన్ ట్యాబ్లెట్లు వేసిన తర్వాతే సరఫరా చేయాలని సూచించారు. నాగర్​కర్నూల్, వనపర్తి జిల్లాలలో ప్రత్యామ్నాయ చర్యల ద్వారా తాగునీటి సరఫరా చర్యలు చేపట్టామని వనపర్తి కలెక్టర్ యాస్మిన్ బాష వివరించారు. ఎక్కడా తాగునీటిని ట్యాంకర్ల ద్వారా రవాణా చేయడం లేదని, తాగునీటి బోర్లను, స్కీం బోర్లను వినియోగించుకుంటున్నామని చెప్పారు.

స్మితా సబర్వాల్​తో అధికారులు
స్మితా సబర్వాల్​తో అధికారులు

సమస్య ఉత్పన్నం కాగానే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని, మహబూబ్​నగర్ మున్సిపాలిటీతో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలు, గ్రామాల్లో తాగునీటి సమస్య ఇబ్బందులు తలెత్తకుండా కోయిల్​సాగర్, రామన్​పాడు పథకాల ద్వారా తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేశామని మహబూబ్​నగర్ కలెక్టర్ వెంకట్రావు వివరించారు. గతంలో ఉన్న పవర్ బోర్లు, స్కీం బోర్లను పునరుద్ధరించి తాగునీటి కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఉద్యానవనానికి ఫిదా..

ఎల్లూరు మిషన్ భగీరథ ప్రధాన పంపు హౌస్​ను సందర్శించిన స్మితా సబర్వాల్ అక్కడ అభివృద్ధి చేసిన ఉద్యానవనాన్ని చూసి ముగ్ధులయ్యారు. హైదరాబాద్​లో కూడా ఇలాంటి ఉద్యానవనం లేదని, ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడ వాతావరణం ఉందని కితాబిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ స్థలాలలో ఇలాంటి ఉద్యానవనాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిషన్ భగీరథ ఉద్యానవనంలో మొక్కలు నాటారు.

అధికారులతో కలిసి మొక్కలు నాటిన స్మితా సబర్వాల్

ఇవీ చూడండి: నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.