నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ చెంచులు మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎంతో కాలం నుంచి చెంచులు అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని చెంచు సంఘం నాయకులు తెలిపారు. అడవి రక్షణ పేరుతో అటవీశాఖ అధికారులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చెంచులు అడవిలో స్వేచ్ఛగా బతుకనీయకుండా నిబంధనల పేరుతో అడవిని నమ్ముకొని జీవితం వెళ్లదీస్తున్న తమ మీద జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కుల దేవతలకు పూజలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెంచుల అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించట్లేదన్నారు. ధర్నాకు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ధర్నా అనంతరం ఐటీడీఏ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఇదీ చదవండి: నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇద్దరు చెంచులు మృతి