నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో బ్రేకులు ఫెయిలై పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ మీదుగా చిన్నంబాయి మండల కేంద్రానికి తీసుకొస్తుండగా ప్రమాదం జరిగింది. కొల్లాపూర్ శివార్లలోని పీజీ కళాశాల వద్దకు రాగానే బ్రేకులు పడకపోవడంతో రోడ్డు పక్కన మట్టి కుప్ప ఎక్కి బోల్తాపడింది.
ప్రమాదం నుంచి లారీ డ్రైవర్ బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో సహాయక చర్యలు చేపట్టి పడిపోయిన లారీని పైకి లేపారు.
ఇదీ చదవండి: యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. అటువైపే చూడని అధికారులు