దేవాలయాల ముందు అక్రమ టోల్గేట్లు ఎత్తివేయాలి: భాజపా - BJP leaders call for lifting of toll gates
అచ్చంపేట పట్టణంలో హిందూ దేవాలయాల ముందు అక్రమ టోల్ గేట్లను ఎత్తివేయాలని భాజపా శ్రేణులు డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద రాస్తారోకో చేపట్టారు. నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో హిందూ దేవాలయాల ముందు ఏర్పాటు చేసిన టోల్ గేట్లను ఎత్తివేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. నల్లమలలోని దైవ క్షేత్రాలకు వెళ్లడానికి యాత్రికుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదని విమర్శించారు.
అటవీశాఖ అధికారులు.. అక్రమంగా టోల్ గేట్లను ఏర్పాటు చేయడం సమంజసం కాదు. ఇప్పటికైనా గేట్లు ఎత్తి వేయాలి. లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తాం.
-భాజపా నేతలు
భాజపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసే సమయంలో ఇరువురీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇదీ చూడండి: రంగనాథస్వామి ఆలయం.. ఆసియాలోనే అతిపెద్ద గోపురం