రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర భాజపా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని భాజపా నాయకులను కల్వకుర్తి పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా నాయకులను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని నేతలు డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెరాస ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని విమర్శించారు. సమస్యలను గుర్తించి, పరిష్కరించకపోవడమే కాక.. సమస్యలపై మాట్లాడే వారి పట్ల కఠినంగా వ్యవహరించి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యలన్నింటికీ భవిష్యత్తులో తెరాస తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు.
మరోవైపు వనపర్తి జిల్లా పరిధిలోని మండలాల భాజపా కార్యకర్తలను సైతం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
ఇదీచూడండి.. ఐదో తరగతి వరకే చదివాడు... ప్రముఖ ఆస్పత్రుల్లో పెద్ద డాక్టరయ్యాడు!