ETV Bharat / state

ఆపద సమయంలో ఆకలి తీర్చుతున్న బీరం ఫౌండేషన్​ - ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​ రెడ్డి ఫౌండేషన్​

గడప దాటితే కొవిడ్​ భయం.. లోనే ఉంటే ఆకలి బాధలు. తప్పని పరిస్థితిలో దూర ప్రయాణాలు. కొవిడ్​ బారిన పడి ఐసోలేషన్​లో ఉంటే వైరస్​ కంటే ముందే ఆకలితోనే ప్రాణం పోయే పరిస్థితి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా నాగర్​ కర్నూల్​ జిల్లాలోని కొల్లాపూర్​లో బీరం ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

beeram foundation
Telangana news
author img

By

Published : May 19, 2021, 12:37 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​ మండలంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీరం ఫౌండేషన్​ కష్టకాలంలో అభాగ్యుల ఆకలి తీర్చుతుంది. లాక్​డౌన్​ అమలు చేస్తున్నప్పటి నుంచి దూరప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులతో పాటు, ఐసోలేషన్​లో ఉంటున్న వారికి ఆహారం అందిస్తోంది.

ఉదయం పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం, మధ్యాహ్నం చికెన్, రాత్రిపూట గుడ్డుతో అన్నం అందిస్తున్నట్లు కొల్లాపూర్ పురపాలిక ఛైర్​పర్సన్​ విజయలక్ష్మి చెప్పారు. లాక్​డౌన్​ సమయంలో కొవిడ్​ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందుకోసమే ఐసోలేషన్​లో ఉంటున్న వారి కోసం ఆహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఆహారం దొరక్క సతమతవుతుండడం వల్ల వారికి భోజన వసతి కల్పిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​తో ఉపాధి కరవాయె.. పిల్లలకు పట్టెడన్నం వరమాయె.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.