ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 5 నుంచి జరగబోయే ఆర్టీసీ సమ్మెకు నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని పార్టీలు, ఉద్యోగ సంఘాలు మద్దతు పలికాయి. జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో సమావేశ మందిరంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు... కాంగ్రెస్, భాజపా,వామపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో ఆర్టీసీ బంద్కు అన్ని పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించినట్లు తెలిపాయి.
ఇవీ చూడండి: ప్రధానికీ తప్పని 'ఉల్లి' కష్టాలు.. కూరలో వాడొద్దని ఆదేశం!