ETV Bharat / state

యూపీ ప్రభుత్వ తీరు దుర్మార్గం: వంశీచంద్​రెడ్డి - నాగర్ కర్నూల్ జిల్లా వార్తలు

హాథ్రస్​ అత్యాచార ఘటనను నిరసిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని పోలీసులు అడ్డకున్న తీరును తీవ్రంగా ఖండించారు. తక్షణమే నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

aicc secratary vamsichand reddy
సత్యాగ్రహ దీక్ష
author img

By

Published : Oct 6, 2020, 9:52 AM IST

హాథ్రస్​ అత్యాచార ఘటనను నిరసిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద బైఠాయించి ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు వంశీ కృష్ణ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం, యోగీ సర్కార్​ తీరుపై హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని అక్కడి పోలీసులు అడ్డకోవడాన్ని తీవ్రంగా ఖండించకారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడేందుకు వెళ్లిన నేతల పట్ల యూపీ సర్కార్​ దుర్మార్గంగా వ్యవహరించిందని ఆరోపించారు. తక్షణమే నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: హేమంత్​ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.