అదనపు న్యాయస్థానాల ద్వారా కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 3 అదనపు జూనియర్ సివిల్ కోర్టులను జస్టిస్ హిమాకోహ్లీ వర్చువల్‌గా ప్రారంభించారు.
![additional courts started in nagarkarnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-mbnr-6-14-court-opening-avb-ts10050_14062021193044_1406f_1623679244_754.jpg)
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి.. రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కోర్టులు ఉపయోగపడతాయని ప్రేమావతి ఆశాభావం వ్యక్తం చేశారు.
![additional courts started in nagarkarnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-mbnr-6-14-court-opening-avb-ts10050_14062021193044_1406f_1623679244_377.jpg)