ETV Bharat / state

రామప్పకు వారసత్వ హోదా దక్కేనా...? - will ramappa be recognized by world heritage

ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందే క్రమంలో భాగంగా యునెస్కో ప్రతినిధి రామప్ప ఆలయం మొత్తం కలియతిరిగారు. చూసినంతమేరకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ రెండో రోజు పర్యటించి గ్రామస్థులను కలవనున్నారు. వారసత్వ హోదా వస్తే తమ గ్రామం ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరుకుంటుందని పాలంపేట వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రామప్పకు వారసత్వ హోదా దక్కేనా...?
author img

By

Published : Sep 26, 2019, 6:06 AM IST

Updated : Sep 26, 2019, 3:52 PM IST

రామప్పకు వారసత్వ హోదా దక్కేనా...?

యునెస్కో ప్రతినిధి రాకతో అద్భుత శిల్పసంపదకు నిలయంగా మారిన రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ హోదాకు మరింత చేరువైంది. చారిత్రక కట్టడాలపై నిపుణులు పరిశోధనలు చేసి అణువణువూ పరిశీలించారు. సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సప్తస్వరాలు పలికే శిల్పాన్ని ఆసక్తిగా గమనించారు. దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లను గురించిన సమాచారాన్ని కాకతీయ హెరిటేజ్‌ సభ్యులు యునెస్కో ప్రతినిధికి తెలియజేశారు. ఎక్కడికక్కడ చరవాణితో చిత్రాలు తీసుకుంటూ దాదాపు నాలుగు గంటలు ఆలయంలో గడిపారు.

'ఇప్పటి వరకు సంతృప్తిగానే సాగింది'

యునెస్కో ప్రతినిధి పర్యటన సంతృప్తికరంగా సాగిందని.. ఆలయానికి సంబంధించిన అన్ని అంశాలను నిశితంగా పరిశీలించారని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు.

వేయి స్తంభాల గుడి సందర్శన...

అనంతరం హన్మకొండలోని వేయిస్తంభాల గుడిని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసి ఆలయ పరిసరాల్లో కలియతిరిగారు. ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకన్నారు. రాతి కట్టడం అందాలను చరవాణీలో బంధించారు.

రెండో రోజు ఆలయ వీక్షణ...

ఇవాళ రెండో రోజు యునెస్కో ప్రతినిధి రామప్ప ఆలయాన్ని వీక్షించి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమవుతారు. రెండు రోజుల రామప్ప ఆలయ పర్యటన ముగించుకొని యునెస్కో ప్రతినిధి ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ బయలుదేరి వెళ్తారు. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా వస్తే.. తమగ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని పాలంపేట వాసులు ఆశిస్తున్నారు.

ఇదీ చదవండిః రామప్పను సందర్శించనున్న యూనెస్కో బృందం

Last Updated : Sep 26, 2019, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.