ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు దేశానికే ఆచరణీయంగా మారాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టంచేశారు. మహబూబాబాద్ అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా ములుగులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ములుగులో ఓటమి పాలైనా... ఇచ్చిన మాట ప్రకారం జిల్లా చేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. దేశంలో ఏ ప్రధాని, ఏ సీఎం చేయని ఆలోచన రైతుల కోసం గులాబీ బాస్ చేశారంటూ కొనియాడారు.
ఇవీ చూడండి:దేశంలో బడితే ఉన్నోడిదే బర్రె : కేటీఆర్