ములుగు జిల్లా గోవిందరావు పేటలో మేడ్చల్ డిపో మేనేజర్ పాల్ ఆధ్వర్యంలో తాత్కాలిక బస్టాండ్‌ను ఈరోజు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి 200 సర్వీసులను నడుపుతున్న ఆర్టీసీ తాజాగా 30 బస్సులను ములుగు జిల్లా గోవిందరావు పేట నుంచి మేడారానికి నడపడానికి సిద్ధమైంది.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ పని చేస్తుందని ఆయన అన్నారు. ఈనెల 8 వరకు బస్సు సౌకర్యాలను వినియోగించు కోవచ్చన్నారు.
ఇదీ చూడండి : మేడారం జాతరలో ఉచిత వైఫై..