ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అమ్మవారి గద్దెల వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని రంగారెడ్డి ఆర్‌ఎం వరప్రసాద్ ప్రకటించారు. ఫిబ్రవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఆర్టీసీ తరఫున 500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక బస్సులకు ఒకటిన్నర శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. బస్సు సీట్ల రిజర్వేషన్ కోసం www.tsrtconline.in లో చేసుకోవచ్చునని పేర్కొన్నారు.
ఈ నెల 26వ తేదీన రద్దీ దృష్ట్యా ప్రయోగాత్మకంగా 40 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, జగద్గిరిగుట్ట, నేరేడ్‌మెట్, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, లాల్ దర్వాజ ప్రాంతాల నుంచి ఈ బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు