ETV Bharat / state

'మార్చిలోపు సమ్మక్క బ్యారేజీ పనులు పూర్తి చేయాలి' - smitha sabarwal projects visit

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని సమక్క బ్యారేజీని సీఎంఓ కార్యదర్శి స్మితసబర్వాల్​, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్​కుమార్​ సందర్శించారు. బ్యారేజీలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనులు మార్చి 31లోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

smitha sabarwal visited sammakka project
'మార్చి 31లోపు సమక్క బ్యారేజీ పనులు పూర్తి చేయాలి'
author img

By

Published : Jan 10, 2021, 7:54 PM IST

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెం గ్రామ సమీపంలో ఉన్న సమక్క బ్యారేజీని ముఖ్యమంత్రి కార్యాలయం సెక్రెటరీ స్మిత సబర్వాల్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ సందర్శించారు. ప్రాజెక్టు అధికారులతో కలిసి బ్యారేజీలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమావేశమయ్యారు.

సమయం వృథా చేయకుండా 24 గంటలు పనుల్లో నిమగ్నం అవ్వాలని స్మితా సబర్వాల్​ సూచించారు. ప్రాజెక్టు పనులను మార్చి 31లోగా పూర్తిచేయాలన్నారు. ఎలాంటి సమస్యలు లేనప్పుడు ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ప్రాజెక్టు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య, ఐటీడీఏ పీఓ హనుమంతు కె జండగే, సమ్మక్క బ్యారేజీ అధికారులు ఇంజినీర్ ఛీప్ జనరల్ మురళీధరరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ దేవాదుల బి నాగేంద్ర రావు, ఎస్ఈ ములుగు సుధీర్, ఈఈ జగదీశ్​ తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఆధునిక పద్ధతిలో పంటల సాగు... లాభాలు బహుబాగు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.