మేడారం జాతర పారిశుద్ధ్య లోపాలు తలెత్తకుండా కార్మికులు శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తున్నారు. ములుగు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి దాదాపు 15 వేల మంది కార్మికులను నియమించారు. చెత్త తరలింపు వాహనాలను అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే జంపన్న వాగు, సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతంలో పొగవుతున్న చెత్తను ఎప్పటికప్పుడు ట్రాక్టర్లలో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో దోమల బెడద లేకుండా రసాయనాలను పిచికారి చేస్తున్నారు.
ఇవీచూడండి: మేడారం స్పెషల్: జుట్టు అమ్మకుంటే ఆడాళ్లైనా అరగుండే..!