ములుగు జిల్లా మంగపేట మండలంలో మల్లూరు వాగు పొంగి ప్రవహిస్తోంది. మొట్లగూడెం వద్ద కొత్తగా నిర్మించిన రోడ్డు కొట్టుకుపోవడం వల్ల బాలింతలు, గర్భిణులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పురుడు పోసుకున్న పూరేడపల్లికి చెందిన బాలింత కుర్సుం యశోదను వైద్యులు ఇవాళ ఇంటికి పంపించారు. 102 వాహనంలో సిబ్బంది ఆమెను వాగు ఒడ్డుకు చేర్చారు. వాగు దాటి అవతలి ఒడ్డుకు చేరుకునేందుకు బాలింత యశోద తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్రామస్థుల సాయంతో ఆమె వాగును క్షేమంగా దాటడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీచూడండి: పులిబిడ్డకు బారసాల.. హిమాదాస్గా నామకరణం!