కరోనా వైరస్ నివారణ కోసం ములుగు జిల్లాలో పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసేందుకు పోలీసు యంత్రాంగం ములుగు పురవీధులు, దారులు, కూడళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ప్రజలు గుంపులుగా ఉండే ప్రదేశాలను పరిశీలించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఆరుబయట క్రికెట్ ఆడుతున్న పిల్లలు డ్రోన్ కెమెరాలను చూసి పరుగులు పెడుతున్నారు. ములుగు జిల్లా గ్రీన్‌జోన్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
ఇవీ చూడండి: శిక్షించడంలోనే కాదు... ఆదుకోవడంలోనూ మాకు మేమే సాటి