ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని... తిరుగు ప్రయాణమయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలానికి చెందిన భక్తుడు దర్శనం చేసుకునే సమయంలో జేబులో ఉన్న పర్సు పడిపోయింది. దర్శనానికి వచ్చిన మరో భక్తుడికి దొరికింది. దానిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు.
బాధితుడు శ్యామ్ మీడియా పాయింట్ వద్దకు వచ్చి తెలిపాడు. అతనికి ఎస్సై తిరుపతి 8వేల రూపాయలు ఉన్న ఆ పర్స్‌ను పరిశీలించి అప్పగించారు. పోగొట్టుకున్న పర్స్ తనకు దొరికినందకు శ్యామ్ హర్ష వ్యక్తం చేశాడు. నిజాయితీగా తనకు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.