ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కరోనాతో బాధపడుతున్న 15 కుటుంబాలకు బియ్యం, పప్పు సహా ఇతర నిత్యావసర సరకులను ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన మేడారం జాతర ప్రధాన పూజారి సిద్ధబోయిన మునేంద్ర కోడలు కొవిడ్‌తో మరణించగా.. వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.
కరోనా తీవ్రత అధికంగా ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ.. మాస్కులు ధరించాలని కోరారు.
మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ఆకుల భాయమ్మ ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధం అయింది. ఆమెను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క.. 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జాలపు అనంతరెడ్డి, సహకార సంఘం ఛైర్మన్ పులి సంపత్ గౌడ్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పిరిలా వెంకన్న, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జంట నగరాల్లోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం