స్థానిక రాజకీయ నాయకులు.. నీటి కోసం పోట్లాడుకోవడం తప్ప, ధ్వంసమైన రోడ్డును పట్టించుకోవడం లేదంటూ ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని కేశవాపూర్ గ్రామస్థులు మండిపడ్డారు. అధికారులకు నీటి మీద ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాల మీద లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిని తక్షణమే బాగు చేయాలని డిమాండ్ చేశారు.
మండలంలోని వంగపల్లి చెరువులోకి.. గ్రావిటీ కాలువ ద్వారా అధికారులు రామప్ప సరస్సు నుంచి నీటిని తరలిస్తున్నారు. గత వర్షాకాలంలో.. వరదలకు సగం రోడ్డు కొట్టుకుపోయి గోతి ఏర్పడింది. వచ్చీ పోయే వాహనదారులు కుంటలో పడి గాయాలపాలవుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు.. ఇప్పటికైనా రహదారిని పూర్తి చేయాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: చల్లబడిన భానుడు... చిరుజల్లులతో వరుణుడు