ములుగు జిల్లాలో చిరుత సంచారంతో....అటవీ ప్రాంత సమీప గ్రామస్థులు భయం భయంగా రోజులు గడుపుతున్నారు. సాయంత్రమైతే బయటకి వచ్చేందుకు జంకుతున్నారు. వాజేడు మండలం కొంగాల, దూలాపూరం మధ్యలో జామాయిల్ తోటలో.... చిరుత ఓ లేగదూడను చంపడం....అందరిలోనూ భయం రేకెత్తించింది. లేగదూడ అరుపులు విని...పశువుల కాపర్లు పరిగెత్తుకు రావడంతో...చిరుత అడవిలోకి పరుగుతీసింది.
పదిహేను రోజుల క్రితం తొలిసారిగా ఈ ప్రాంతంలో చిరుత సంచారం...వెలుగులోకి వచ్చింది. వాజేడు మండలం...కొంగాల అటవీ ప్రాంతంలో...చిటారు కొమ్మనెక్కిన చిరుత...గ్రామస్తుల కంట బడింది. వారంతా కేకలు వేయడం...పెద్దగా శబ్దాలు చేయడంతో...అది సమీప అటవీ ప్రాంతంలోకి పరిగెత్తింది.
చిరుత సంచారం, జంతువులను వేటాడడంతో.. అటవీ అధికారులు అప్రమత్తమైయ్యారు. కొంగాల, దూలాపురం గ్రామాల్లో జిల్లా అధికారులు పరిశీలన జరిపారు. ఎండాకాలం కావడం...సమీపంలోని జలపాతాల్లో దాహం తీర్చుకోవడానికి, జంతువులను వేటాడేందుకు చిరుత ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
మరోపక్క.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం లో పులి సంచారం కలకలం రేపింది. ఐలాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులు కనపడ్డాయి.
వెంటనే సంబంధిత బీట్ అధికారి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అటవీ ప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు చేయాలని వారు ఆదేశించారు.
- ఇదీ చూడండి : వాహనాలు తగలబడటానికి కారణమేంటి...? ఎలా నివారించాలి..?