ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర అభివృద్ధి పనులను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. తాత్కాలిక పనులను ప్రణాళికాబద్ధంగా చేస్తున్నట్లు తెలిపారు.
చిలుకలగుట్టకు పోయే రహదారి నిర్మాణ పనులు, రెడ్డిగూడెం, ఊరటం క్రాస్‌రోడ్డు వద్ద భక్తులకు తాగు నీటికోసం నిర్మిస్తున్న వాటర్ ట్యాంకులు, పార్కింగ్ స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తామని తెలిపారు.