ములుగు జిల్లా రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ నర్స్ డే ను పురస్కరించుకొని ఎమ్మెల్యే సీతక్క నర్సులు, ఆశా వర్కర్లను సన్మానించారు. వారందరినీ శాలువాలతో సత్కరించి చీరలు బహుమానంగా ఇచ్చారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో నర్సులే రోగులకు కొండంత అండంగా ఉంటున్నారని సీతక్క వివరించారు.
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు వైద్యులతో పాటు నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నారని అన్నారు. కనిపించే దైవాలుగా వైద్య సేవలు అందిస్తున్న నర్సులందరికీ ఎమ్మెల్యే సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, గుండ బోయిన మహేందర్, బాబురావు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్