ETV Bharat / state

మీ జిల్లాకు వచ్చి పెత్తనం చెలాయిస్తే మీరు ఊరుకుంటారా.?: సీతక్క

ములుగు జిల్లాలో రామప్ప సరస్సు నుంచి కాల్వ గేట్ల ప్రారంభానికి తనను పిలవలేదని ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్​ నిబంధనలు పాటించని ఇరిగేషన్​ అధికారులపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. నీటి తరలింపు ద్వారా తమ ప్రాంత రైతులు నష్టపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

mla seethakka fired on mla gandra
ఎమ్మెల్యే గండ్రపై సీతక్క ఫైర్​
author img

By

Published : Apr 11, 2021, 7:06 PM IST

ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే అయినందుకా తనపై ఇంత వివక్ష అని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవడంలో ఇరిగేషన్​ అధికారుల ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ములుగు జిల్లాలో రామప్ప సరస్సు నుంచి కాల్వ గేట్ల ప్రారంభానికి తనను పిలవలేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి ఏం అధికారం ఉందని అన్నారు. ఈ విషయంపై ప్రివిలేజ్​ కమిటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పక్క జిల్లా అధికారులు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తుంటే అధికారులు ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు. అదే వారి జిల్లాకు వచ్చి పెత్తనం చెలాయిస్తే ఆ ప్రజాప్రతినిధులు ఒప్పుకుంటారా అని మండిపడ్డారు.

రామప్ప చెరువు నిండితే నష్ట పోయేది తమ రైతులేనని, నీట మునిగేది తమ భూములేనని అన్నారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గేట్లను ఎత్తివేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

సంబంధిత వార్త: గేట్ల ఎత్తివేతకు ఎమ్మెల్యే సీతక్కను పిలవలేదని నాయకుల ఆగ్రహం

ఇదీ చదవండి: ఉపఎన్నిక వేళ... వెక్కిరిస్తోన్న సమస్యల మేళా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.