ETV Bharat / state

దిల్లీ వెళ్లొచ్చి సీఎం మాట మార్చారు: సీతక్క - తెలంగాణ వార్తలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ రైతులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. దిల్లీ వెళ్లొచ్చి ఆయన మాట మార్చారని విమర్శించారు.

mla-seethakka-comments-on-cm-kcr-and-pm-modi-in-mulugu-district
దిల్లీ వెళ్లొచ్చి సీఎం మాట మార్చారు: సీతక్క
author img

By

Published : Dec 30, 2020, 6:04 PM IST

రైతుల పట్ల సీఎం కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ములుగు జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు. సీఎం కేసీఆర్, పీఎం మోదీ ఇద్దరూ ఒక్కటేనని... దిల్లీ పర్యటన తర్వాత కేసీఆర్ మాట మార్చారని ఆరోపించారు.

రాబోయే రోజుల్లో రైతులు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పటం ఖాయమని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని అన్నారు. దేశంలో 80% చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు... కానీ దాని వల్ల కార్పొరేట్​కే మేలు జరుగుతుందని అన్నారు.

ఇదీ చదవండి: పురపాలికలకు నిధులివ్వండి.. కేంద్రమంత్రులకు కేటీఆర్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.