ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా, చల్వాయి, మచ్చపూర్ గ్రామాల్లో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించారు. 8 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పస్రా సమీపంలోని డంపింగ్‌యార్డును పరిశీలించారు. అనంతరం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో అటవీ ప్రాంతం చాలా ఉంది. అడవిని ఎంత సంరక్షించుకుంటే అంత మేలు జరుగుతుంది. ఈ వర్షాకాలంలో ములుగు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నప్పటికీ.. అవి రాకుండా నివారించుకునేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రైతులు సన్నరకం వరి పంటలు పండించాలి. మొక్కజొన్న వేయకుండా పత్తి, సోయాబిన్, వేరుశనగ, కందులు, పెసర్లు తదితర పంటలు సాగు చేసుకోవాలి.
-మంత్రి సత్యవతి
కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.