ETV Bharat / state

మేడారం పూజారి మృతి పట్ల మంత్రి సత్యవతి సంతాపం - మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయం

మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ పూజారి సమ్మారావు కొవిడ్​తో మృతి చెందారు. ఆయన భార్య మృతి చెందిన కొద్ది రోజులకే అతనూ వైరస్​తో పోరాడి మృత్యువాత పడ్డారు. వీరీ మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్​ విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Minister Satyavati
మేడారం సమ్మక్క-సారలమ్మ
author img

By

Published : May 27, 2021, 5:35 PM IST

కొవిడ్​ ధాటికి ప్రాణాలు విడిచిన మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ పూజారి సమ్మారావు మృతి పట్ల.. గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు. మహమ్మారి బారిన పడి ఆయన భార్య మృతి చెందిన కొద్ది రోజులకే సమ్మారావు కూడా మృత్యువాత పడటం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సమ్మారావు దంపతుల ఇద్దరు పిల్లల బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి.. ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: Etala rajendar: ఈటల రాజేందర్‌ చేరికకు భాజపా అధిష్ఠానం పచ్చజెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.