ETV Bharat / state

అధికారులు, నేతలతో మంత్రి సత్యవతి రాఠోడ్​ సమీక్ష - అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్​ సమీక్ష

నూతన రెవెన్యూ చట్టం, ఎల్​ఆర్​ఎస్​, ఆర్ఓఎఫ్ఆర్, జీవో 58,59పై జిల్లా అధికారులు, నేతలతో మంత్రి సత్యవతి రాఠోడ్ బుధవారం సమీక్షించారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

జిల్లా అధికారులు, నేతలతో మంత్రి సత్యవతి రాఠోడ్​ సమీక్ష

author img

By

Published : Oct 1, 2020, 7:20 AM IST

ములుగు కలెక్టరేట్​లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సత్యవతి రాఠోడ్​ సమీక్షించారు. నూతన రెవెన్యూ చట్టం, ఎల్​ఆర్​ఎస్​, ఆర్ఓఎఫ్ఆర్​పై చర్చించారు. ములుగులో అటవీ భూముల సమస్యను సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో డిజిటల్ సర్వే చేస్తున్న నేపథ్యంలో భూముల హక్కులు, యాజమాన్యంపై స్పష్టత వస్తుందని మంత్రి అన్నారు.

కొత్త రెవెన్యూ చట్టంలో రెవెన్యూ అధికారుల పరిధి, బాధ్యత, హక్కులు స్పష్టంగా పేర్కొన్నారని సత్యవతి రాఠోడ్​ వెల్లడించారు. డిజిటల్ సర్వేలో ప్రజలకు, భూ యజమానులకు ఎలాంటి అనుమానాలున్నా అధికారులు నివృత్తి చేస్తారని వివరించారు. భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి న్యాయం చేసే విధంగా ఈ చట్టం అమలు జరగనుందని మంత్రి అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్, వైస్ ఛైర్మన్ నాగజ్యోతి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ప్రాజెక్టు డైరెక్టర్ హన్మంతు తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి: రేపటి నుంచి పట్టభద్రుల కోటా ఎన్నికల ఓటర్ల నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.