ETV Bharat / state

ములుగు ఆస్పత్రిలో డయాగ్నొస్టిక్​ సెంటర్​ ప్రారంభించిన సత్యవతి రాఠోడ్​ - తెలంగాణ తాజా వార్తలు

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్​ సెంటర్​ను ఎంపీ మాలోతు కవితతో కలిసి మంత్రి సత్యవతి రాఠోడ్​ ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు.

Telangana news
ములుగు వార్తలు
author img

By

Published : Jun 9, 2021, 5:52 PM IST

ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటు తెచ్చేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.3కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్​ సెంటర్​ను మంత్రి ప్రారంభించారు.

ఈ కేంద్రంలో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో వెనకబడిన ప్రాంతాలైన ములుగు, సిరిసిల్ల జిల్లాలు పైలెట్ ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్​ ఎంపిక చేశారని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రతి ఒక్కరు కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకుని.. లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: TS News: ఆ ఆసుపత్రులకు లైసెన్సులు పునరుద్ధరించారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.