ములుగు జిల్లాను సస్యశ్యామలంగా చేసే విధంగా సమగ్ర నివేదిక తయారు చేసి సీఎం కేసీఆర్కు సమర్పించనున్నట్టు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. జిల్లాలో చివరి గుంట వరకు నీరు అందించే విధంగా కృషి చేస్తానన్నారు. కలెక్టరేట్లోని విజిటర్స్ హాల్, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ప్రారంభించి... దేవాదుల ఎత్తిపోతల పథకం, మైనర్ ఇరిగేషన్, ఎస్సారెస్పీపై సమీక్ష నిర్వహించారు. ములుగులో ప్రతి ఎకరాకి గోదావరి నీరు తీసుకువచ్చేందుకు నివేదిక రూపొందించాలని అధికారులను కోరారు.
ప్రతి మండలానికి ఒక ప్రణాళిక ఉండేలా, పనులు సత్వరం జరిగే విధంగా చూడాలన్నారు. రామప్ప బ్యాక్ వాటర్ వల్ల ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇబ్బంది జరిగినందున అందరూ సహకరించాలన్నారు. మైనర్ ఇరిగేషన్, ఇతర నీటి పారుదల శాఖలో ఎవరి పరిధిలో వచ్చే ఆయకట్టు ఎంత వరకు అనేది స్పష్టంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ ఛైర్పర్సన్ కుసుమ జగదీశ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సునీల్