ETV Bharat / state

KTR Mulugu Tour : '75ఏళ్లు పరిపాలించి ఏం చేయలేని కాంగ్రెస్‌ నేతలను నమ్ముదామా?' - కేటీఆర్ కామెంట్స్

KTR Mulugu Tour Today : 75ఏళ్లు ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవద్దని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. సంక్రాంతికి గంగిరెద్దులొళ్లుచ్చినట్టుగానే ఎన్నికల వేళ రంగురంగుల వేషాలేసుకొని వచ్చి... ప్రజలను ఆగం చేయాలని చూస్తారని విమర్శించారు. ములుగు జిల్లాలో 150 కోట్ల విలువైన పనులకు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

KTR
KTR
author img

By

Published : Jun 7, 2023, 3:38 PM IST

KTR Visits Mulugu Today : గిరిపుత్రుల జిల్లా ములుగులో ఇవాళ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లాలో 150 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్​లో ములుగుకు చేరుకున్న కేటీఆర్​కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ స్వాగతం పలికారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కేటీఆర్ వెంట ఉన్నారు. మొదట 65 కోట్లతో నిర్మించే సమీకృత జిల్లా కలెక్టరేట్​కు, రూ.38 కోట్లతో నిర్మించే ఎస్పీ కార్యాలయానికి కేటీఆర్ భూమి పూజ చేశారు.

ఈ తర్వాత కోటి 25 లక్షలతో నిర్మించే మోడల్ బస్ స్టేషన్, 50 లక్షలతో రూపాయలతో నిర్మించే సేవాదళ్ భవన్​కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ములుగులో 15.95 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు, ఐదు మోడల్ పోలీస్ స్టేషన్​లకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. అనంతరం, దశాబ్ది వేడుకల్లో భాగంగా ములుగులో నిర్వహించిన సాగునీటి ఉత్సవాల బహిరంగసభకు కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్... గత పాలకుల హయాంలో జరిగిన అభివృద్ధిని ఎత్తిచూపుతూ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

KTR Comments at Mulugu Tour : 75ఏళ్లు ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవద్దని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. సంక్రాంతికి గంగిరెద్దులొళ్లుచ్చినట్టుగానే ఎన్నికల వేళ రంగురంగుల వేషాలేసుకొని వచ్చి... ప్రజలను ఆగం చేయాలని చూస్తారని విమర్శించారు. పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌ను పాలిస్తూ అక్కడి ప్రజలకు ఏమీ చేయలేని కాంగ్రెస్‌... రాష్ట్రంలో కేసీఆర్‌ను విమర్శిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలకు వాళ్ల పనులు, పైరవీలు తప్ప ప్రజల కష్టాలు తెలియవని విమర్శించారు.నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో 14 ఏళ్లు పోరాడి స్వరాష్ట్రం తెచ్చుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

'ములుగు జిల్లా రూపురేఖలు మారుస్తున్నాం. దాశరథి.. తెలంగాణను కోటి రతనాల వీణ అన్నారు. కోటిన్నర ఎకరాల మాగాణి అని కేసీఆర్ రుజువు చేశారు. చెరువులు మత్తడి దూకుతాయని కలలోనైనా ఎప్పుడైనా అనుకున్నామా? 70 ఏళ్ల కాంగ్రెస్ పాలన మనకు బాగా తెలుసు. పక్కనున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పాలన ఒకసారి చూడండి. 3,146 తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నాం. ములుగులో కలెక్టరేట్‌, మోడల్ బస్టాండ్‌, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశాం.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 12 క్వింటాళ్ల వరి మాత్రమే కొంటోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎకరానికి రూ.2 వేలు ఇచ్చే దిక్కులేదన్న ఆయన... ఇక్కడ ఎకరానికి రూ.10 వేలు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలోని రామప్ప ఆలయాన్ని మంత్రి కేటీఆర్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు కేటీఆర్​కు ఘనస్వాగతం పలికారు. రామలింగేశ్వరస్వామి ఆలయంలో కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.

24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : అలాగే సాగునీటి ఉత్సవాల బహిరంగసభకు హాజరైన మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ములుగును గతంలో ఎవరూ పట్టించుకోలేదన్న ఎర్రబెల్లి... మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే అని వ్యాఖ్యానించారు. ములుగులో ఆస్పత్రి, వైద్యకళాశాల నిర్మిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, 24 గంటల కరెంట్ ఇవ్వాలని సూచించారు. రైతుబంధు కింద ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే అని ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు.

KTR Mulugu Tour : '75ఏళ్లు పరిపాలించి ఏం చేయలేని కాంగ్రెస్‌ నేతలను నమ్ముదామా?'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.