ETV Bharat / state

జాతరకు గుంతల రోడ్ల స్వాగతం... భక్తులకు ప్రాణసంకటం - medaram jathara problems

మేడారం మినీ జాతర సమయం ఆసన్నమైంది. వచ్చే నెల చివరి వారంలో జరగనున్న జాతరకు... ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని వెళ్తున్నారు. భారీ వర్షాల కారణంగా దయ్యాల వాగు పొంగిపొర్లి... రోడ్లను ఛిద్రం చేసింది. ఇప్పటికే మేడారానికి తమ సొంత వాహనాల్లో వస్తున్న భక్తులు... దెబ్బతిన్న రహదారులతో తీవ్ర ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. మరమ్మతు చేయకపోతే... ప్రజలు మేడారానికి రావటం చాలకష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు.

medaram roads damaged heavily due to rain

author img

By

Published : Jan 29, 2021, 12:04 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మినీ జాతర వచ్చే నెల 24 నుంచి 27 వరకు జరగనుంది. ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​​, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పది లక్షల పైనే రానున్నారు. గతేడాది జరిగిన మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

కరోనా కారణంగా మూత...

కరోనా కారణంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాలతో పాటు మేడారం సమ్మక్క సారలమ్మ గుడి కూడా మూతపడింది. లాక్​డౌన్ కారణంగా అమ్మవార్ల దర్శన భాగ్యానికి భక్తులు నోచుకోలేకపోయారు. అన్​లాక్‌ అయ్యాక కూడా నవంబరు వరకు గుడి తలుపులు తెరవకపోవటం వల్ల భక్తులు గేటు ముందే మొక్కులు తీర్చుకున్నారు. నవంబర్ 1న గుడి తలుపులు తెరవటం మొదలు... ఆది, బుధ, గురువారాల్లో భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు.

వర్షాల ధాటికి రోడ్లు ఛిద్రం...

ఈ ఏడాది భారీ వర్షాలు కురవటం వల్ల పస్ర నుంచి మేడారం రహదారి చాలా వరకు పాడైపోయింది. నవంబర్, డిసెంబర్ నెలలో జంపన్నవాగులో ఊరట్టం, నార్లపూర్, కొత్తూరు, మేడారం, పడిగాపురం ఇసుక క్వారీలు ప్రారంభించగా... లారీల రాకపోకలతో రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయి. రోజురోజుకు భక్తులు రాక పెరుగుతున్నప్పటికీ... అధికారులు మాత్రం రోడ్డు మరమ్మతు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. అక్కడక్కడ తూతూమంత్రంగా రిపేరు చేసి చేతులు దులుపుకుంటున్నారు. లారీల రాకపోకలతో ఆ మరమ్మతులు కాస్తా... ఒక్క రోజుకే పరిమితమవుతున్నాయి.

వచ్చే నెల 24 నుంచి 27 వరకు జరగనున్న మినీ జాతరకి భారీ సంఖ్యలో భక్తులు... తమతమ సొంత వాహనాల్లో రానున్నారు. ఈ రహదారి ఇలాగే ఉంటే మాత్రం రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లాభం లేకుండాపోతోందని వాపోతున్నారు.

ఇదీ చూడండి: నిరుద్యోగులకు శుభవార్త... భృతిపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.