Medaram Jatara Special Buses 2024 : మేడారం జాతర పనుల్లో నాణ్యతపై రాజీపడే ప్రసక్తి లేదని మంత్రులు సీతక్క, కొండా సురేఖ అన్నారు. జాతర ఏర్పాట్లపై మేడారంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Medaram Sammakka Saralamma Jatara 2024 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతలను రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒడిషా, మహారాష్ట్ర నుంచి వేలాదిమంది భక్తజనం తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా వనదేవతల సన్నిధికి చేరుకొని జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. పసుపు కుంకుమ, ఒడిబియ్యం, చీర, సారె, గాజులు, పువ్వులు, పండ్లు, కొబ్బరికాయలు పట్టుకొని ఆ తల్లుల గద్దల వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో చివరిరోజు దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
"మేడారం జాతర పనుల విషయంలో రాజీపడే ప్రశక్తే లేదు. అధికారులు పనుల విషయంలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాము. మేము అధికారం చేపట్టి రెండు నెలలు సైతం కాకుండానే బీఆర్ఎస్ నేతలు మాపై బురద జల్లుతున్నారు. జాతరకు 2వేల బస్సులు నడుపుతున్నాము. ప్రజలు జాతరకు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలి.'' - మంత్రులు సీతక్క, కొండా సురేఖ
మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి : సీతక్క
Ministers Seethakka Konda Surekha Visiting Medaram : మేడారం మహాజాతరకు సమయం దగ్గరుపడుతున్న క్రమంలో జాతర ఏర్పాట్లపై మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడారం వచ్చిన మంత్రులు ముందుగా సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఒకటిన్నర కోట్ల రూపాయలతో నిర్మించనున్న పూజారుల అతిథి గృహ సముదాయానికి సీతక్కతో కలిసి మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.
Medaram Jatara Development Works Not Started : మేడారం జాతర పనులకు 'కోడ్' అడ్డంకులు
Medaram Jatara Arrangements In Telangana : జాతర ఏర్పాట్లపై మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాణ్యత లేని నిర్మాణాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఇప్పటికే జాతర ఏర్పాట్ల కోసం రూ.75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు సిద్దం చేయాలని తెలిపారు. మేడారం జాతరను కేంద్రం జాతీయ పండుగగా గుర్తించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
సమ్మక్క సారలమ్మల జాతరకు 2వేల బస్సులు నడుపుతున్నామని మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని తెలిపారు. తాము అధికారం చేపట్టి రెండు నెలలు సైతం కాకుండానే బీఆర్ఎస్ నేతలు బురద జల్లుతున్నారని తమపై విమర్శలు తగవని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా దర్శనాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రులు జాతరను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.
ఈనెల 28 నాటికే మేడారం జాతర పనులు పూర్తి
తాగు నీటి ఎద్దడి నివారణ కోసం తగిన చర్యలు తీసుకోవాలి : మంత్రి సీతక్క