ETV Bharat / state

వచ్చే ఏడాది మేడారం జాతర తేదీలు ఖరారు - medaram maha Jatara 2022 dates final

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర 2022 తేదీలు ఆలయ పూజారులు ప్రకటించారు. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

medaram maha jatara 2022 dates, medaram maha jatara news today
వచ్చే ఏడాది మేడారం జాతర తేదీలు ఖరారు
author img

By

Published : Apr 25, 2021, 4:07 PM IST

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారలమ్మ జాతర గిరిజన సంప్రదాయం ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. గుడి సమీపంలో ఉన్న కమిటీ హాలులో కుల పెద్దలు, పూజారులు సమావేశమై జాతర తేదీలను ఖరారు చేశారు.

  • 16 ఫిబ్రవరి 2022 బుధవారం రోజున సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపైకి వచ్చుట
  • 17 ఫిబ్రవరి 2022 గురువారం రోజున చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దెలపైకి వచ్చుట
  • 18 ఫిబ్రవరి 2022 శుక్రవారం రోజున భక్తులు అమ్మవార్లకు మొక్కులు సమర్పించుట
  • 19 ఫిబ్రవరి 2022 శనివారం రోజున సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతలు వన ప్రవేశం

ప్రస్తుతం కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో మే 1 నుంచి 15వ వరకు గుడి తలుపులు మూసి వేయనున్నట్లు పూజారులు వివరించారు.

ఇదీ చూడండి : కరోనా టెస్ట్​లో నెగిటివ్.. కానీ ప్రాణం పోయింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.